Employees : రెచ్చిపోయిన దొంగలు.. ఉద్యోగులపై దాడి

Advertisement

అక్షరటుడే, బోధన్​: Employees : సాలూర saloora శివారులోని ఎత్తిపోతల పంప్ హౌస్ వద్ద శనివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ట్రాన్స్​ఫార్మర్​ transformer కాయిల్స్​ చోరీ చేయడానికి వచ్చిన దొంగలను అక్కడే ఉన్న ఆపరేటర్ operator , వాచ్​మన్​ అడ్డగించారు. దీంతో దొంగలు వారిపై దాడి చేసి అక్కడ నుంచి పరారయ్యారు. గతంలో కూడా ఎత్తిపోతల పథకం lift irrigation ట్రాన్స్​ఫార్మర్లు చోరీ అయ్యాయి. నిందితులను పట్టుకోవాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

 Employees : రైతుల ఆందోళన

ప్రస్తుతం వరి పంట paddy fields పొట్టదశలో ఉంది. అసలే ఎండలు మండుతుండటంతో పంటకు నీరందక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ట్రాన్స్​ఫార్మర్ల చోరీలు జరుగుతుండంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలకు నీరు సరిపోవడం లేదని.. ఇలాంటి సమయం ట్రాన్స్​ఫార్మర్​ పోతే వరి పొలాలు ఎండిపోతాయని వాపోతున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  CM REVANTH | జీతాలు ఇచ్చుడే కష్టంగా ఉంది..డీఏలు అడగొద్దు : సీఎం రేవంత్​

 Employees : కొత్తదాని కోసం ఆగాల్సిందే..!

వ్యవసాయ క్షేత్రాలు, ఎత్తిపోతల పథకాల వద్ద ట్రాన్స్​ఫార్మర్లు పాడయినా.. చోరీ అయినా.. కొత్త వాటిని తెచ్చుకోవడానికి రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. పోయిన దాని స్థానంలో మరోదానిని ఇవ్వడానికి ఆలస్యం అవుతుందని అన్నదాతలు పేర్కొంటున్నారు.