గోడను తవ్వేశారు.. మొబైల్స్ దోచేశారు!

0

అక్షరటుడే, నిజామాబాద్: నగరంలోని తిలక్ గార్డెన్ కాంప్లెక్స్ లోని ఓ మొబైల్ షాప్ లో చోరీ జరిగింది. శ్రీ వేంకటేశ్వర మొబైల్స్ దుకాణం వెనుకాల నుంచి గోడను తవ్విన దొంగలు విలువైన సెల్ ఫోన్లను అపహరించుకెళ్లారు. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. నిందితులు ఓ పథకం ప్రకారం గోడను తవ్వి చోరీకి పాల్పడ్డారు. ఒకటో టౌన్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. సీపీ క్యాంప్ ఆఫీస్ కు కూత వేటు దూరంలోనే చోరీ జరిగిన దుకాణం ఉంది. రాత్రివేళ పోలీసుల పెట్రోలింగ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ.. దొంగలు మాత్రం సులువుగా చోరీ చేసి ఉడాయించడం ఆశ్చర్యకరం.