అక్షరటుడే, ఎల్లారెడ్డి: గాంధారి మండల కేంద్రంలోని ఓ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. గాంధారికి చెందిన కుమ్మరి రంజిత్ తన కుటుంబంతో సహా ఇంటికి తాళం వేసి గురువారం వేములవాడ దర్శనానికి వెళ్లారు. తిరిగి శుక్రవారం రాత్రి గంటలకు ఇంటికి వచ్చే సరికి ఇల్లు తాళం పగులగొట్టి ఉంది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగలు బీరువాలో ఉన్న 7 తులాల బంగారు ఆభరణాలు, రూ. 1500 నగదు ఎత్తుకెళ్లారని బాధితుడు తెలిపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.