ఒకే రోజు తొమ్మిదిళ్లలో చోరీ

0

అక్షరటుడే, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకే రోజు తొమ్మిదిళ్లలో చోరీకి పాల్పడ్డారు. పట్టణ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. పట్టణంలోని శ్రీరాంసాగర్‌ కాలనీ, వివేకానంద కాలనీ, స్నేహపురి కాలనీల్లోని పలు ఇళ్లలో శుక్రవారం తెల్లవారు జామున దొంగలు చొరబడ్డారు. తొమ్మిది ఇళ్లలో నుంచి బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.