Advertisement

అక్షరటుడే, ఆర్మూర్: పట్టణంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల విష్ణు అపార్ట్మెంట్, మహాలక్ష్మి కాలనీలోని వైష్ణవి రెసిడెన్సీలోకి ప్రవేశించి చోరీకి యత్నించారు. ముఖానికి ముసుగులు ధరించిన వ్యక్తులు అపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతూ రెక్కీ నిర్వహించారు. ఈ దృశ్యాలను సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. కాగా ఏ ప్లాట్ లోనూ చోరీ జరగకపోవడంతో ఇళ్ల యజమానులు ఊపిరి పీల్చుకున్నారు. దొంగలు తిరుగుతున్న నేపథ్యంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement