అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : నగరంలో బుధవారం రాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహాలక్ష్మి నగర్లో ఓ ఇంట్లో చోరీ చేశారు. తాళం వేసి ఉండడానికి గమనించిన దొంగలు లోనికి చొరబడి ఐదున్నర తులాల బంగారం ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. కాగా దొంగలు కాలనీలో తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Power cut | దుబ్బ సబ్​స్టేషన్​ పరిధిలో విద్యుత్​ అంతరాయం