అక్షరటుడే ,ఎల్లారెడ్డి: తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకొని దొంగలు రెచ్చిపోయారు. ఎల్లారెడ్డి పరిధిలోని రెండు గ్రామాల్లో చోరీకి పాల్పడ్డారు. పర్మల్ల, శెట్పల్లి గ్రామాల్లో శుక్రవారం అర్థరాత్రి ప్రవేశించిన దొంగల ముఠా.. పెద్దమొత్తంలో బంగారం, విలువైన వస్తువులను దోచుకెళ్ళింది. ఎండాకాలం కావడంతో ఇంటికి తాళాలు వేసి దాబాల పైన కుటుంబీకులు నిద్రించారు. శనివారం నిద్రలో నుంచి లేచి చూడగా తాళాలు ధ్వంసం చేసి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. చోరీ అయిన సొత్తుపై వివరాలు సేకరిస్తున్నారు.