(మెదక్)ఎల్లారెడ్డి, అక్షరటుడే: “ప్రజలు ఆకలితో అలమటిస్తున్నప్పుడు పనికి ఆహార పథకం ద్వారా ఈ చర్చి నిర్మాణం చేపట్టారు. ప్రజలందరికీ భోజన పెట్టాలనే ఆలోచనతో ఈ గొప్ప దేవాలయం నిర్మించడం హర్షణీయం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ దేవాలయం వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని పరిడవిల్లుతుందన్నారు. తాని పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మెదక్ పర్యటనకు వచ్చినప్పుడు చర్చిని సందర్శించుకున్నా.. మళ్ళీ సీఎం హోదాలో వచ్చానని చెప్పారు. చర్చి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. వెంట మంత్రి దామోదర్ రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మైనపల్లి రోహిత్, స్థానిక నాయకులు ఉన్నారు.
Advertisement
Advertisement