అక్షరటుడే, వెబ్డెస్క్: Akbaruddin Owaisi | తెలంగాణ అసెంబ్లీ నుంచి సోమవారం ఎంఐఎం నాయకులు వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ ప్రభుత్వం అసెంబ్లీని నడుపుతున్న తీరు సరిగ్గా లేదని పేర్కొన్నారు. అసెంబ్లీని అసెంబ్లీలా నడపండి.. గాంధీ భవన్ లా కాదని వ్యాఖ్యానించారు.
ఇది అసెంబ్లీ అని.. గాంధీ భవన్ కాదని.. సభను నడపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందంటూ వాకౌట్ చేస్తున్నామని అక్బరుద్దీన్ తెలిపారు. అనంతరం తమ సభ్యులతో కలిసి సభ నుంచి వెళ్లిపోయారు.
ఇది అసెంబ్లీ.. గాంధీ భవన్ కాదు : అక్బరుద్దీన్ ఓవైసీ#assembly #telangana pic.twitter.com/1OVdXMRACP
— Akshara Today (@aksharatoday) March 17, 2025