
అక్షరటుడే, వెబ్డెస్క్ : Allahabad High Court | సాధారణంగా ప్రేమించిన యువతి, యువకులు ఇంట్లో పెళ్లికి ఒప్పుకోకపోతే పారిపోతారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ police stationకు వచ్చి తమకు రక్షణ protection కల్పించాలని కోరుతుంటారు. వారి తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సెలింగ్ counselling ఇచ్చి పంపిస్తుంటారు. అయితే తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్న జంటలకు పోలీస్ ప్రొటెక్షన్ అడిగే హక్కు లేదని అలహాబాద్ హైకోర్టు Allahabad High Court | సంచలన తీర్పు చెప్పింది. పోలీస్ ప్రొటెక్షన్ కోసం శ్రేయ కేసర్వాని దంపతులు దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెల్లడించింది.
నిజంగానే ప్రాణహాని ఉన్న వారికి మాత్రమే ప్రొటెక్షన్ ఇవ్వాలని, పేరెంట్స్parents ని కాదని పెళ్లి చేసుకున్నోళ్లు అందరికి ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో సీరియస్ థ్రెట్ లేదని.. ప్రొటెక్షన్ అవసరం లేదని పేర్కొన్న న్యాయస్థానం పిటిషన్ను కొట్టేసింది. తమ ఇష్టం మేరకు వెళ్లిపోయి పెళ్లి చేసుకున్న వారికి రక్షణ కల్పించడం కోర్టు బాధ్యత కాదని తెలిపింది. ఒకవేళ ఆ జంటకు నిజంగానే ప్రాణహాని ఉంటే చట్ట ప్రకారం పోలీసులు నిర్ణయం తీసుకోవాలని సూచించింది.