Bill Gates | ఆ నలుగురు అద్భుతం.. మోదీ, టాటా, కిషన్ భాను, శ్రీ రామానుజన్ పై గేట్స్ ప్రశంసలు

Bill Gates | ఆ నలుగురు అద్భుతం.. మోదీ, టాటా, కిషన్ భాను, శ్రీ రామానుజన్ పై గేట్స్ ప్రశంసలు
Bill Gates | ఆ నలుగురు అద్భుతం.. మోదీ, టాటా, కిషన్ భాను, శ్రీ రామానుజన్ పై గేట్స్ ప్రశంసలు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Bill Gates | మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారత్కు చెందిన నలుగురిని అద్భుతమైన వ్యక్తులని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ Prime Minister Narendra Modi, ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త రతన్ టాటా Ratan Tata, డాక్టర్ మహారాజ్ కిషాన్భాను, గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ Srinivasa Ramanujan అద్భుతమైన వ్యక్తులని కొనియాడారు. రాజకీయాలు, సైన్స్, వ్యాపారం, గణిత శాస్త్రంలో వారు అసాధారణ కృషి చేశారని కొనియాడారు. కుదిరితే వారితో విందు చేయాలనుకుంటానని తెలిపారు. రాజ్ షమానీ పాడ్కాస్ట్లో పాల్గొన్న గేట్స్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Advertisement

Bill Gates | ఎంతో మంది ప్రతిభావంతులు..

పాడ్కాస్ట్లో పాల్గొన్న గేట్స్ను ఆదర్శవంతమైన విందు సంభాషణ కోసం జీవించి ఉన్న, లేదా చనిపోయిన ముగ్గురు భారతీయుల పేర్లను చెప్పాలని రాజ్ షమానీ కోరారు. అయితే, భారత్లో ఎంతో మంది అద్భుతమైన ప్రతిభావంతులు ఉన్నారని బిల్గేట్స్ Bill Gates చెప్పారు. మోదీ నాయకత్వాన్ని, భారతదేశం పట్ల ఆయన దీర్ఘకాలిక దృక్పథాన్నిఆయన ప్రశంసించారు. రతన్ టాటా శక్తివంతమైన ఆవిష్కరణలు, పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేశారని ప్రశంసించారు. “నేను రతన్ టాటాతో పాటు భారతదేశంలో చాలా మంది అద్భుతమైన దాతలు, ఆవిష్కర్తలతో కలిసి పనిచేశాను” అని గేట్స్ గుర్తు చేసుకున్నారు. భారతదేశ బయోటెక్నాలజీ విభాగాన్ని స్థాపించడంలో సహాయం చేసిన దివంగత డాక్టర్ ఎంకే భాన్ తో తన సమావేశాన్ని గుర్తుచేసిన గేట్స్.. ఆయనను “గొప్ప శాస్త్రవేత్త” అని అభివర్ణించారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Ratan Tata | రతన్​ టాటా ఆస్తుల్లో సింహభాగం ఛారిటీకే.. మిగతావి ఎవరికిచ్చారంటే..!