అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారు సోమవారం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కిడ్నీ బాధితులు ప్రజాభవన్‌కి వెళ్లి తమ సమస్యలపై వినతి పత్రం ఇచ్చినప్పటికీ ఎలాంటి స్పందన లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కిడ్నీ మార్పిడి అయిన పేషెంట్లకు ప్రతినెలా మందులకు రూ.పది వేల ఖర్చు అవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కిడ్నీ బాధితులకు రూ.పది వేల పెన్షన్ ఇస్తున్నారని, తెలంగాణలో కూడా ఇచ్చేలా చూడాలని కోరారు.