election duties | ఎన్నికల విధులు నిర్వహించినవారికి గౌరవ వేతనం ఇవ్వాలి

election duties | ఎన్నికల విధులు నిర్వహించినవారికి గౌరవ వేతనం ఇవ్వాలి
election duties | ఎన్నికల విధులు నిర్వహించినవారికి గౌరవ వేతనం ఇవ్వాలి

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: election duties : ఇటీవల జరిగిన ఎన్నికల్లో పనిచేసిన ఉద్యోగులకు, అధికారులకు ఒకనెల గౌరవ వేతనం ఇవ్వాలని టీజీవో సంఘం అధ్యక్షుడు అలుక కిషన్​, కార్యదర్శి అమృత్​కుమార్​ కోరారు. ఈ మేరకు నిజామాబాద్​ కలెక్టరేట్​లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతుకు వారు వినతిపత్రం అందజేశారు.

Advertisement
Advertisement

స్పందించిన కలెక్టర్..​ వెంటనే ప్రధాన ఎన్నికల అధికారికి జిల్లా నుంచి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వారు కలెక్టర్​తో మాట్లాడుతూ కలెక్టరేట్​లో విద్యుత్​ వినియోగాన్ని తగ్గించేందుకు IDOCలో సోలార్ ప్యానెళ్లలను ఏర్పాటు చేయాలని కోరారు. వాహనాల పార్కింగ్​ కోసం షెల్టర్​ ఏర్పాటు చేయాలని విన్నవించారు. సంఘం ప్రతినిధులు దేవి సింగ్, చందర్, దండు స్వామి, గంగాధర్, రామస్వామి, గోవర్ధన్, కీర్తిరాజ్​ తదితరులున్నారు.

Advertisement