అక్షరటుడే, వెబ్‌డెస్క్: స్టాక్ మార్కెట్లోకి మరో పెద్ద ఐపీవో వస్తోంది. ఎన్టీపీసీ అనుబంధ కంపెనీ అయిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ సబ్స్క్రిప్షన్ మంగళవారం ప్రారంభమై 22న ముగియనుంది. రూ.10వేల కోట్లను సమీకరించాలన్న లక్ష్యంతో వస్తున్న ఈ కంపెనీ.. ప్రైస్ బ్యాండ్‌ను ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.102 నుంచి రూ.108గా నిర్ణయించింది. ఐపీవోలో పాల్గొనాలనుకునేవారు కనీసం 138 షేర్ల కోసం బిడ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ కంపెనీ షేర్లు 27న ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో లిస్ట్ కానున్నాయి. ఐపీవో ద్వారా వచ్చే ఆదాయాన్ని రుణభారాన్ని తగ్గించుకోవడంతో పాటు సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.