అక్షరటుడే, హైదరాబాద్: hailstorm : గత పది రోజులుగా తీవ్రమైన ఎండలు తెలంగాణ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే, నేటి నుంచి ఎండలతోపాటు, వడగండ్ల వానలు ఉండబోతున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరం భీం ఆసిఫాబాద్, జగిత్యాల, ములుగు, వరంగంల్ జిల్లాల్లో వడగండ్ల వానల ప్రభావం ఉండబోతోంది. శుక్ర, శనివారాల్లో ఉరుములు.. మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉన్నందున ఈ ప్రాంతాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ ను ప్రకటించింది.
ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో గురువారం రాత్రి వాతావరణం చల్లబడింది. మెల్లగా వర్షాలు ప్రారంభమయ్యాయి. కొన్నిచోట్ల పిడుగులు పడ్డట్లు తెలుస్తోంది. ఈ నెల 22 నుంచి ఉరుములతో కూడిన వర్షాలు కురువబోతున్నాయి. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్‌లోనూ అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. బలమైన ఈదురు గాలుల ప్రభావం కూడా ఉండబోతోంది. మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురువనున్నాయి. ఆసిఫాబాద్, జగిత్యాల, సిరిసిల్లలో కూడా ప్రభావం ఉండనుంది.
శుక్రవారం (మార్చి 21) తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం మంచిర్యాలు, ఆసిఫాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉండనున్నాయి.
నిజామాబాద్, కామారెడ్డి, మహబూబాబాద్, నిర్మల్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉంది.