అక్షరటుడే, వెబ్డెస్క్ : MLC Vijayashanthi | ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులను MLC Vijayashanti’s couple అంతు చూస్తానని చంద్రకిరణ్రెడ్డి అనే వ్యక్తి బెదిరించాడు. ఈ మేరకు ఎమ్మెల్సీ విజయశాంతి భర్త Vijayashanti husband బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో Banjara Hills police station ఫిర్యాదు చేశారు.
విజయశాంతి బీజేపీలో ఉన్న సమయంలో చంద్రకిరణ్ రెడ్డి ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ social media accounts నిర్వహించేవారు. ఆమె కాంగ్రెస్లో చేరాక ఆయనను పక్కనపెట్టింది. దీంతో తనకు డబ్బులు చెల్లించాలని విజయశాంతికి చంద్రకిరణ్ రెడ్డి బెదిరింపు మెసెజ్లు పంపుతున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.