అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: nizamabad city | నగరంలో ఓ యువతి తండ్రిపై కత్తితో దాడి చేసిన కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సౌత్ రూరల్ సీఐ సురేశ్ nizamabad south rural inspector suresh తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
నగరంలోని ఆరోటౌన్ పరిధిలో అక్బర్ కాలనీ(akbar colony) (కెనాల్ కట్ట)లో సయ్యద్ పాష అతని కుటుంబంతో నివాసముంటున్నారు. కాగా.. అతని మనువరాలి పట్ల ఇంటి పక్కనే ఉంటున్న సోహైల్‌ఖాన్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో ఈనెల 2న సయ్యద్ పాష, సోహెల్ ఇంటికి వెళ్లి ఆరాతీశారు. సోహెల్ కుటుంబీకులు సయ్యద్ పాషపై దాడి చేశారు. అలాగే అదే రోజు సాయంత్రం మరోసారి సయ్యద్ పాష ఇంటికి వెళ్లి అతని అల్లుడు షేక్‌గౌస్‌పై కత్తితో దాడి చేశారు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. శుక్రవారం నిందితులు ఆరిఫ్ ఖాన్, సోహెల్ ఖాన్, షేక్ పర్వేజ్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.