అక్షరటుడే,ఆర్మూర్‌ : శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టులోకి వరదనీరు వచ్చి చేరుతుండడంతో మూడు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 80.501 టీఎంసీల నీరు ఉంది. మూడు వరద గేట్ల ద్వారా 9,372 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ కొత్త రవి తెలిపారు.