అక్షరటుడే, ఆర్మూర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వరద నీరు కొనసాగుతుండడంతో మూడు గేట్లను ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా ప్రస్తుతం నిండుకుండలా ఉంది. జలాశయంలోకి 18,826 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా అంతే మొత్తంలో అవుట్ ఫ్లో నమోదు అవుతున్నట్లు డ్యాం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కొత్త రవి తెలిపారు.