అక్షరటుడే, ఎల్లారెడ్డి: అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన మేకల కాపరి హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు సంబంధించిన వివరాలను ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు విలేకరులకు వెల్లడించారు. తాము చేసిన దొంగతనం బయట పడుతుందేమోనని మల్లయ్యపై కక్ష పెంచుకొని ముగ్గురు కలిసి పథకం ప్రకారం హత్య చేసి గుంతలో పూడ్చిపెట్టారని తెలిపారు. సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డికి చెందిన చిన్నమల్లయ్య(53) ఈనెల 19న మేకలను మేపడానికి ఇంట్లో నుంచి వెళ్లి తిరిగిరాలేదు. దీంతో అతని కుమారుడు ప్రదీప్ సదాశివనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు చరవాణి లొకేషన్ పరిశీలించారు. మల్లన్న గుట్ట వద్ద చివరగా లోకేషన్ చూపించింది. అతని వెంట కందూర్ పెద్ద సాయిలు వెళ్లినట్లు గుర్తించి.. విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హత్య కేసులోని మరో ఇద్దరు నిందితులు సుమన్, బీరయ్య గతంలో దొంగతనానికి పాల్పడ్డారు. దీనిని మల్లయ్య కుమారుడు ప్రవీణ్ చూశాడు. అయితే ఇటీవల ప్రవీణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మల్లయ్య నిందితులతో వారి దొంగతనం గురించి పలుమార్లు మాట్లాడాడు. కక్ష పెంచుకున్న నిందితులు నీ కొడుకుకు పట్టిన గతే నీకూ పడుతుందంటూ మల్లయ్యతో పలుమార్లు గొడవకు దిగారు. ఈ నేపథ్యంలో ఎప్పటికైనా ఈ విషయం బయటకు వస్తుందని.. మల్లయ్యను అంతమొందించాలని పథకం మల్లయ్యను హత్య చేసి పూడ్చిపెట్టారు. కాగా పోలీసులు ఈనెల 23న మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు. కేసును ఛేదించిన సీఐ సంతోష్ కుమార్, ఎస్సై రాజును అభినందించారు.
దొంగతనం బయటపడుతుందేమోనని..
Advertisement
Advertisement