అక్షరటుడే, వెబ్‌డెస్క్: పుష్ప- 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. సంధ్య థియేటర్ యజమానితో పాటు సెక్యూరిటీ మేనేజర్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. సరైన భద్రతా చర్యలు చేపట్టని కారణంగా ఈ ఘటనలో రేవతి మృతి చెందినట్లు పోలీసులు తేల్చారు.