Advertisement
అక్షరటుడే, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని దుండిగల్ మీదుగా వెళ్లే నర్సాపూర్ రహదారిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. నర్సాపూర్ అటవీ ప్రాంత శివారు మేడాలమ్మ ఆలయం సమీపంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి రెండు ఆటోలను ఢీ కొట్టింది. ఈ ఘటనలో మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ కి చెందిన మనీషా, మెదక్ జిల్లా రుస్తుంపేటకు చెందిన ఐశ్వర్య, మరో వ్యక్తి(సూరారం) మృతి చెందగా.. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో నర్సాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Advertisement
ఇది కూడా చదవండి : GHMC : ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం.. బకాయి వడ్డీపై 90 శాతం మినహాయింపు