అక్షరటుడే, వెబ్ డెస్క్: మాక్లూర్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. మూడేళ్ల బాలికను వరుసకు తండ్రి అయిన వ్యక్తి హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నగరానికి చెందిన సునీత భర్త మృతి చెందగా.. ఆమెకు మూడేళ్ల కూతురు లక్కీ ఉంది. ప్రస్తుతం బాలిక తన అమ్మమ్మ ఇంట్లో ఉండగా.. సునీత ధర్మోరా గ్రామానికి చెందిన అరుణ్ ను రెండో వివాహం చేసుకుంది. బుధవారం అరుణ్ తో పాటు అతని సోదరి సోని కలిసి లక్కీని ధర్మోరాకు తీసుకెళ్లారు. గురువారం ఉదయం సునీత స్నానానికి వెళ్లిన సమయంలో లక్కీని గొంతునులిమి హత్య చేశారు. అనంతరం లక్కీ ఎండదెబ్బతో మృతి చెందినట్లు తల్లి సునీతను నమ్మించారు. ఒంటిపై గాయాలు ఉండడంతో అనుమానం వ్యక్తం చేసిన తల్లి పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు.