అక్షరటుడే, వెబ్ డెస్క్: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మాక్లూర్ మండలం ఒడ్యాట్పల్లి చెరువులో ప్రమాదవశాత్తు నీట మునిగి ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. గ్రామానికి చెందిన అయిదుగురు యువకులు శనివారం గ్రామ శివారులోని చెరువులో ఈత కోసం వెళ్లారు. లోతు తెలియక నీటిలో దిగగా.. ముగ్గురు గల్లంతయ్యారు. అనంతరం ఈతగాళ్లు చెరువులో దిగి మృతదేహాలను బయటకు తీశారు. మాక్లూర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.