అక్షరటుడే, బాల్కొండ: ఎస్సారెస్పీ లక్ష్మి కాల్వలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. శుక్రవారం మెండోరా మండలం పరిధిలోని లక్ష్మి కాల్వలో దిగిన యువకులు కాసేపటికి గల్లంతయ్యారు. గల్లంతైన వారు జక్రాన్‌పల్లి మండలం గన్యా తండాకు చెందిన సాయినాథ్, లోకేశ్, మున్నాగా గుర్తించారు. వీరికోసం స్థానికులు, అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. తండాకు చెందిన మొత్తం ఆరుగురు యువకులు లక్ష్మి కెనాల్ లో దిగారు. వీరిలో ముగ్గురు క్షేమంగా బయటపడగా మరో ముగ్గురు కాల్వలో గల్లంతైనట్లు సమాచారం. యువకుల కుటుంబీకులు పెద్ద ఎత్తున అక్కడికి చేసుకున్నారు.