అక్షరటుడే, బోధన్: CP Sai Chaitanya | బోధన్ పట్టణంలో హనుమాన్ శోభాయాత్రకు(Hanuman Shobhayatra in bodhan) కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని సీపీ సాయి చైతన్య(CP Sai Chaitanya) పేర్కొన్నారు. పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో బోధన్ డివిజన్ పోలీసు అధికారులు, హనుమాన్ స్వాములు, కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాత్ర ప్రశాంతంగా జరిగేలా పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. ఎలాంటి వదంతులను నమ్మవద్దని.. ఏదైనా సమాచారం ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. యాత్ర ముగిసేవరకు నిరంతర నిఘా (Surveillance) ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్ bodhan Acp srinivas, టౌన్, రూరల్ సీఐలు వెంకట్ నారాయణ bodhan Town inspector venkat narayan, విజయ్‌బాబు bodhan ruaral inspector vijay babu ఉన్నారు.