అక్షరటుడే, నిజామాబాద్: కమిషనరేట్ లోని వ్యాపార సంస్థలకు గుడ్ న్యూస్. రాత్రి సమయ వేళలపై సడలింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. మహా శివరాత్రి , గుడ్ ఫ్రైడే, రంజాన్, ఉగాది, శ్రీ రామనవమి, హనుమాన్ జయంతి పండుగలను దృష్టిలో ఉంచుకుని రాత్రి 12 గంటల వరకు వ్యాపారాలు నిర్వహించుకునే వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం రాత్రి 10.30 గంటల్లోపు వ్యాపారాలు మూసి వేయాలనే నిబంధన అమల్లో ఉంది. అయితే తాజా సడలింపు ఏప్రిల్ నెల చివరి వరకు మాత్రమే అమల్లో ఉండనుంది.