Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వ దర్శనానికి 18 గంటల సమయం
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వ దర్శనానికి 18 గంటల సమయం
Advertisement

అక్షరటుడే, తిరుమల: తిరుమల వేంకటేశ్వర స్వామివారి ఆర్జిత(సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన) సేవలకు సంబంధించి ఏప్రిల్ కోటా టికెట్లను జనవరి 18న ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) ప్రకటించింది. ఈ- టికెట్ల కోసం జనవరి 18 నుంచి 20న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని పేర్కొంది.

ఏప్రిల్ 10 నుంచి 12 వరకు నిర్వహించే స్వామివారి సాలకట్ల వసంతోత్సవాలు, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలకు సంబంధించిన టికెట్లను జనవరి 21న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. వర్చువల్ సేవలు, దర్శన స్లాట్ల కేటాయింపునకు సంబంధించి ఏప్రిల్ కోటాను జనవరి 21న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.

ఇతర టోకెన్ల విడుదల తేదీలు, సమయం

  • అంగ ప్రదక్షిణం : జనవరి 23 – ఉదయం 10 గంటలకు
  • శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ : జనవరి 23 – ఉదయం 11 గంటలకు
  • వృద్ధులు, దివ్యాంగుల దర్శనం : జనవరి 23 – మధ్యాహ్నం 3 గంటలకు
  • ప్రత్యేక ప్రవేశ దర్శనం(రూ.300) : జనవరి 24 – ఉదయం 10 గంటలకు
  • తిరుమల, తిరుపతిలలో గదులు : జనవరి 24 – మధ్యాహ్నం 3 గంటలకు
  • శ్రీవారి సాధారణ సేవ : జనవరి 27 – ఉదయం 11 గంటలకు
  • శ్రీవారి నవనీత సేవ : జనవరి 27 – మధ్యాహ్నం 12 గంటలకు
  • శ్రీవారి పరాకామణి సేవ : జనవరి 27 – మధ్యాహ్నం 1 గంటలకు
Advertisement