అక్షరటుడే, కామారెడ్డి: ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో టీఎన్జీవోస్ ముందుంటుందని జిల్లా అధ్యక్షుడు నరాల వెంకటరెడ్డి అన్నారు. కామారెడ్డి మండల సమాఖ్య సమావేశ మందిరంలో శనివారం జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఉద్యోగుల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఉద్యోగులకు తమ యూనియన్ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి దేవరాజు, ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, పోచయ్య, శివకుమార్, జిల్లా గ్రామీణ అభివృద్ధి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డి, మోయిజ్, సాయిలు, గంగరాజం, రాములు, రాముగౌడ్, సాయిరెడ్డి, నరేందర్ రెడ్డి, మాధురి పాల్గొన్నారు.