అక్షరటుడే, వెబ్‌డెస్క్ Today Gold Price : పసిడి రేట్లు (Gold prices) చూస్తుండగానే దిగి రావడం, మళ్లీ పెరగడం మనం చూస్తూనే ఉన్నాం. బంగారం ధరలపై గ్లోబల్ మార్కెట్ల (Global bullion market) ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బులియన్ మార్కెట్ రేట్లు మన దేశంలో బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) బంగారు ఆభరణాల దిగుమతులపై సుంకాలు విధించడంతో పసిడి పరుగు ఆగింది. గత వారం నుంచి బంగారం ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. తాజాగా ఏప్రిల్ 10వ తేదీన బంగారం ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ.. తులం బంగారంపై ఏకంగా రూ.700కుపైగా పెరిగింది. 22 క్యారెట్ల తులం ధర రూ.89,720 ఉండగా, ఇదే 24 క్యారెట్ల ధర రూ.90,450 వద్ద ఉంది.
Today Gold Price : కాస్త పెరిగిన ధరలు..
ఢిల్లీలో (Delhi) 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.83,060 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.90,600 వద్ద కొనసాగుతోంది.చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.82,910 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.90,450 వద్ద ఉంది.ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.82,910 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.90,450 వద్ద ఉంది.హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.82,910 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.90,450 వద్ద ఉంది.విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.82,910 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.90,450 వద్ద ఉంది.బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.82,910 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.90,450 వద్ద ఉంది.
ఇక వెండి విషయానికొస్తే బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. ఇది కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.92,900 ఉంది. నిన్న ఇదే సమయానికి వెండి ధర రూ.93,900 ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి రూ. 1,01,900గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండికి రూ. 92,900గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబై Mumbaiలో కిలో వెండి రూ.92,900 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడలో కేజీ ధర రూ.1,01,900గా ఉంది, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 1,01,900 వద్ద కొనసాగుతోంది. ఆయా ప్రాంతాలను బట్టి ధరలు మారుతుంటాయి.ఇదిలా ఉండగా, పలు వార్తల నివేదిక ప్రకారం, రాబోయే సంవత్సరాల్లో బంగారం ధరలు 38 శాతం వరకు తగ్గవచ్చు . అమెరికన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ మార్నింగ్‌స్టార్ విశ్లేషకుడు జాన్ మిల్స్ బంగారం ధరలు (Gold prices) 38 శాతం తగ్గుతాయని అంచనా వేస్తున్నారు.