Holi festival | తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులో నేడు పిడిగుద్దులాట

Holi festival | తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దులో నేడు పిడిగుద్దులాట
Holi festival | తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దులో నేడు పిడిగుద్దులాట
Advertisement

అక్షరటుడే, నిజామాబాద్: Holi festival : హోలీ పర్వదినం సందర్భంగా తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులో వేడుకగా జరిగే పిడిగుద్దులాటకు హున్సా గ్రామస్థులు ఏర్పాట్లు చేస్తున్నారు. హోలీ పండుగ రోజు ఆనవాయితీగా జరిగే ఈ వేడుకను కొనసాగించేందుకు ఉపక్రమిస్తున్నారు. అయితే ఈ వేడుక నిర్వహణకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతి భద్రత దృష్ట్యా ఈసారి నిర్వహించవద్దని గ్రామస్థులకు పోలీసులు నోటీసులో జారీ చేశారు. ఐదుగురు కంటే ఎక్కువగా గుమిగూడవద్దని పోలీసులు స్పష్టం చేశారు.

Holi festival : దేశంలో ఎక్కడాలేని విధంగా..

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని మంజీర తీరంలో ఉన్న హున్సా గ్రామం ఏటా హోలీ పండుగ నాడు నిర్వహించే పిడిగుద్దులాటతో ప్రత్యేక గుర్తింపు పొందింది. దేశంలో ఎక్కడాలేని విధంగా హోలీ రోజున పిడిగుద్దులాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుతూ కుల మత, వయోబేధం లేకుండా దశాబ్దాలు(సుమారు 125 ఏళ్లకు పైగా)గా ఐక్యతతో ఈ పిడిగుద్దులాటను నిర్వహిస్తున్నారు. వసంత రుతువు రాకకు గుర్తుగా సంబురంగా నిర్వహించే ఈ హోలీ.. ఆ గ్రామంలో మాత్రం పిడిగుద్దులకు వేదికగా అవుతుంది. గ్రామ శ్రేయస్సు కోసం యువత, పెద్దలు రెండుగా విడిపోయి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటూ ఉంటారు.

ప్రతి సంవత్సరం పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేసిన గ్రామస్థులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఈ వేడుకను కొనసాగిస్తున్నారు. ఈ వేడుకను తొలగించేందుకు ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తుంటారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Holi Festival : హోలీ పండుగ జ‌రుపుకోవ‌డం వెన‌క ఉన్న అస‌లు క‌థ ఇదే... పురాణాలు ఏం చెబుతున్నాయంటే..!

Holi festival : అరుదైన వేడుక నిర్వహణ ఇలా..

హోలీ పర్వదినాన.. ఉదయం రంగుల వేడుకలు ముగించుకొని, మధ్యాహ్నం కుస్తీ పోటీలు ఏర్పాటు చేస్తారు. సాయంత్రం పిడుగుద్దులాట ఉంటుంది. గ్రామ ప్రధాన కూడలిలో ఉన్న హనుమాన్ మందిరం ప్రాంగణంలో ఈ వేడుక నిర్వహిస్తారు. గ్రామ పెద్దలు 5 అడుగుల ఎత్తు గల స్తంభాలను ఏర్పాటు చేసి మధ్యలో బలమైన తాడును కడతారు. కుస్తీ పోటీలు ముగిశాక, అసలైన వేడుక ఆరంభం అవుతుంది. డప్పు వాయిద్యాల నడుమ గ్రామ పెద్దలు వేడుక స్థలానికి చేరుకుంటారు. అనంతరం గ్రామస్థులు రెండు బృందాలుగా విడిపోతారు.

తాడుకు ఇరువైపులా గ్రామస్థులు చేరుకుంటారు. ఇరువైపులా ఉన్న వారు, తాడును తమ ఎడమ చేతితో బలంగా పట్టుకుంటారు. గ్రామ పెద్దలు అనుమతి ఇవ్వగానే కుడి చేతితో ఇరువైపులా ఉన్నవారు ఒకరినొకరు బలంగా కొట్టుకుంటారు. సుమారు అరగంట పాటు ఆగకుండా పిడి గుద్దుల వర్షం కురిపిస్తారు. ఆ తర్వాత ఒకరినొకరు ఆలింగనం చేసుకొని, పండుగ శుభాకాంక్షలు తెలుపుకొని అక్కడి నుంచి వెళ్లిపోతారు.

Advertisement