Advertisement

అక్షరటుడే, వెబ్ డెస్క్:

Advertisement
టాలీవుడ్ దర్శకురాలు అపర్ణ మల్లాది(54) కన్నుమూశారు. అపర్ణ గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో చికిత్స తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఆమె కుటుంబ సభ్యులు సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. దీంతో సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. అపర్ణ తెలుగులో 2013లో అనుశ్రీ ఎక్స్పెరిమెంట్స్ అనే సినిమాతో కెరీర్ మొదలు పెట్టారు. 2022లో వచ్చిన పెళ్లి కూతురు పార్టీ అనే సినిమాకి స్క్రిప్ట్ రైటర్ గా, దర్శకురాలిగా వ్యవహరించారు. గతంలో యూట్యూబ్ లో పోష్ పోరీస్ అనే వెబ్ సీరీస్ ని డైరెక్ట్ చేశారు.