అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ప్రభుత్వ భూమిని కాజేసేందుకు ప్రయత్నించిన.. టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. రాయదుర్గంలో దాదాపు 84 ఎకరాల భూమిని సొంతం చేసుకోవాలనుకున్నాడు. ఆర్కియాలజీ డిప్టార్‌మెంట్ సీనియర్ అసిస్టెంట్ కొత్తిని చంద్రశేఖర్ సాయంతో నకిలీ పత్రాలు సృష్టించారు. అనంతరం ఆభూమిలో బిల్డర్ మారగొని లింగంగౌడ్ సాయంతో పాగా వేశాడు. ఈఇష్యూపై 2003లో అప్పటి ప్రభుత్వం హైకోర్టులో కేసు వేసింది. అనంతరం ఈఇష్యూ సుప్రీంకోర్టుకు చేరింది. పూర్తివాదనలు, సాక్ష్యాధారాలను పరిశీలించిన సుప్రీంకోర్టు శివరామకృష్ణ సమర్పించినవి నకిలీ పత్రాలు అని తేల్చింది. సుప్రీంకోర్టు తీర్పుతో శివరామకృష్ణతో పాటు చంద్రశేఖర్, లింగంగౌడ్‌లపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.