అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Encounter | చత్తీస్‌గఢ్(Chhattisgarh)లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత జగదీశ్(Jagadeesh) మృతి చెందినట్లు సమాచారం. జీరామ్(jeeram) ఊచకోత కేసులో నిందితుడిగా ఉన్న ఆయనపై రూ.25 లక్షల రివార్డు ఉంది. శనివారం ఉదయం సుక్మా జిల్లా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు(Security forces), మావోయిస్టు(Maoist)లకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో మొత్తం 16 మంది మావోయిస్టులు మృతి చెందగా, ఇద్దరు భద్రత సిబ్బందికి గాయాలు అయ్యాయి. అయితే ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టుల కీలక నేత జగదీశ్ మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా జగదీశ్ భార్య గతంలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించింది.
Encounter | జీరామ్ ఊచకోత కేసు..
ఛత్తీస్‌గఢ్‌లోని జీరామ్ లోయలో 2013 మే 25 మావోయిస్టులు భారీ ఘాతుకానికి పాల్పడ్డారు. కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్‌పై దాడి చేశారు. నంద్‌కుమార్ పటేల్, విద్యాచరణ్ శుక్లా, మహేంద్ర కర్మ, ఉదయ్ ముదలియార్ వంటి ప్రముఖులతో సహా 30 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను హత్య చేశారు. ఈ కేసులో జగదీశ్ కీలక నిందితుడిగా ఉన్నాడు. తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో ఆయన మృతి చెందాడు. ఈ కేసులో మరో ప్రధాన నిందితురాలు మంజుల అలియాస్ నిర్మల గతేడాది నవంబర్‌లో వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయింది.