అక్షరటుడే, వెబ్‌డెస్క్: Landslides : ఉత్తరాఖండ్ (Uttarakhand)లో మరోసారి వరద విరుచుకుపడింది. అక్కడి చమోలి జిల్లాలో భారీ వర్షం(Chamoli district) విధ్వంసం సృష్టించింది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. సాధారణ జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా థరాలితో పాటు పరిసర ప్రాంతాలలో వరద తీవ్రత ఎక్కవగా ఉంది.
ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షాలు కురవడంతో పాటు కొండచరియలు విరిగిపడటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. కార్లు, ద్విచక్ర వాహనాలు శిథిలాల కింద ధ్వంసమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం చాలా రోడ్లను మూసివేసింది.
శిథిలాలను తొలగించి, కనెక్టివిటీని పునరుద్ధరించడానికి BRO(బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ – Border Roads Organization) వేగంగా పనిచేస్తోంది. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పౌరులను అప్రమత్తం చేశారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు. మరిన్ని వర్షాలు పడే అవకాశం ఉన్నందున, ప్రజలు అవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు.