అక్షరటుడే ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయాన్ని మంగళవారం టౌన్ ప్లానింగ్ రీజినల్ డైరెక్టర్ నరసింహారెడ్డి తనిఖీ చేశారు. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇళ్ల నిర్మాణం కోసం ఇస్తున్న అనుమతులపై అధికారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ సత్యభామ, టౌన్‌ప్లానింగ్ అసిస్టెంట్ సుమల, స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారి ఆంజనేయులు, టీపీఎస్ ప్రవీణ్, మేనేజర్ ఖయ్యూం, ప్రభాకర్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement