అక్షరటుడే, ఆర్మూర్: కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదని ఆ పార్టీ పట్టణాధ్యక్షుడు, ఏఎంసీ ఛైర్మన్ సాయిబాబా గౌడ్ అన్నారు. ఆర్మూర్ పీవీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. వినయ్ రెడ్డి ప్రజాప్రతినిధి హోదాలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థల పరిశీలనకు అధికారులతో కలిసి వెళ్లారన్నారు. ఏ ప్రొటోకాల్‌తో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో బీజేపీ నాయకులు సమావేశం పెట్టారో సమాధానం చెప్పాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ షేక్ మున్ను, నాయకులు అయ్యప్ప శ్రీనివాస్, మోత్కూర్ లింగాగౌడ్, పండిత్ పవన్, కొంతం మురళి, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.