అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: ఈ-కుబేర్‌ పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని టీపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ అనిల్‌ కుమార్‌ పేర్కొన్నారు. రామారెడ్డి, సదాశివనగర్‌ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. రామారెడ్డి, రెడ్డిపేట, అన్నారం, తిమ్మాజివాడి, పద్మాజివాడి తదితర పాఠశాలల్లో టీపీటీఎఫ్‌ మెంబర్‌షిప్‌ క్యాంపెయిన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులకు హెల్త్‌ కార్డ్స్‌ ఇవ్వాలని కోరారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్‌ నాగభూషణం, జిల్లా కార్యదర్శి సీహెచ్‌ లింగం, గోపు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.