అక్షరటుడే, కామారెడ్డి: జిల్లా ట్రెజరీ కార్యాలయంలో అక్రమ వసూళ్లు శోచనీయమని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అనిల్ అన్నారు. ఈ మేరకు బుధవారం ట్రెజరీ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెన్షన్ ప్రపోజల్స్ కోసం ట్రెజరీలో రిటైర్డ్ ఉద్యోగుల నుంచి డబ్బులు డిమాండ్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. 2024 డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు ట్రెజరీ ఐడీ కేటాయించేందుకు సైతం డబ్బులు డిమాండ్ చేయడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి లింగం, జిల్లా ఉపాధ్యక్షురాలు నళినీ దేవి, ఫెడరేషన్ సలహాదారు అంజయ్య పాల్గొన్నారు.