అక్షరటుడే, కామారెడ్డి: ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులపై సర్వే ఒత్తిడి తగ్గించాలని టీపీటీఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు అనిల్, ప్రధాన కార్యదర్శి లింగం కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. పాఠశాలలను ఒంటి గంట వరకు నిర్వహించి ఆ తర్వాత సర్వేకు వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించిందని, గ్రామీణ ప్రాంతాలలో అది అమలు కావడం లేదన్నారు. ప్రతిరోజు 10, సెలవు దినాల్లో 20 కుటుంబాల సర్వే పూర్తి చేయాలని చెబుతున్నారని, ఒక్కో కుటుంబానికి 45 నిమిషాల సమయం పడుతుందన్నారు. ఒక్కో ఎన్యుమరేటర్ సర్వే చేయాల్సిన కుటుంబాల సంఖ్య తగ్గించాలని కోరారు.