అక్షరటుడే, కామారెడ్డి: ప్రభుత్వం జారీ చేసిన జీవో 317తో నష్టపోయిన టీచర్లకు న్యాయం చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి ఎమ్మెల్సీ కోదండరాంను కోరారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్ లో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. 317 జీవో ద్వారా స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులందరికీ లోకల్ క్యాడర్ లో రీ-అలోకేషన్ ఉత్తర్వులు వచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. 317 జీవోపై ప్రభుత్వం ఇటీవల వెలువర్చిన 243, 244 జీవోల ద్వారా ఉపాధ్యాయులకు ప్రయోజనం కలిగే పరిస్థితులు లేవన్నారు. అలాగే నిర్మల్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతుల పక్షాన నిలబడ్డాడనే ఆరోపణలతో టీపీటీఎఫ్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు విజయ్ పై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసేలా చొరవ తీసుకోవాలని కోరారు.