అక్షరటుడే, కామారెడ్డి: ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేలో క్షేత్రస్థాయి ఇబ్బందులను పరిష్కరించాలని టీపీటీఎఫ్ సభ్యులు కోరారు. ఈ మేరకు అదనపు కలెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, విక్టర్‌ను శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఎన్యుమరేటర్ల సంఖ్య పెంచడంతో పాటు సర్వే గడువును పొడగించాలన్నారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్, లింగం, నళిని దేవి, నరేందర్, లక్ష్మి, విజయశ్రీ తదితరులు పాల్గొన్నారు.