11 నుంచి టీపీటీఎఫ్ రాష్ట్ర మహాసభలు

0

అక్షరటుడే, ఇందూరు: టీపీటీఎఫ్ రాష్ట్ర మహాసభలు ఈ నెల 11,12వ తేదీల్లో ఖమ్మంలో జరగనున్నట్లు జిల్లా అధ్యక్షుడు వెనిగళ్ల సురేష్ తెలిపారు. మండల విద్యాశాఖ అధికారి రామారావు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యా యుడు వాసుదేవరావు తో కలిసి మంగళవారం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాసభలకు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు హాజరవుతారన్నారు. ఉపాధ్యాయ సమస్యలు, హక్కులపై తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు. కావున మహాసభలను విజయ వంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు అరవింద్, ఉపాధ్యాయులు మల్లేశం, గోపి, లింబయ్య పాల్గొన్నారు.