కలప స్మగ్లింగ్.. ఆపై యాక్సిడెంట్

0

అక్షరటుడే, ఎల్లారెడ్డి: టేకు దుంగలను స్మగ్లింగ్ చేస్తున్న ట్రాక్టర్ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డి మండలం అడవిలింగాల గేట్ వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లక్ష్మాపూర్ గ్రామం నుంచి అక్రమంగా టేకు దుంగలను ట్రాలీలో (కింద టేకు దుంగలు పైన ఇసుకను నింపుకొని) తీసుకుని అతివేగంగా వెళ్తున్న ట్రాక్టర్ అడివిలింగాల గేట్ సమీపంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో లింగంపేట మండలం జల్దీపల్లి గ్రామానికి చెందిన గాండ్ల రాజు(28) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్టర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.