అక్షరటుడే, ఇందూరు: ద్విచక్ర వాహనాలను అతివేగంగా నడపడం ప్రమాదకరమని ట్రాఫిక్ ఏసీపీ నారాయణ అన్నారు. మంగళవారం గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. విద్యార్థులు లైసెన్స్ కలిగి ఉంటేనే వాహనాలు నడపాలన్నారు. ప్రధానంగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అనంతరం పోలీస్ కళాజాత బృందం ప్రదర్శించిన నాటకం, పాటలు పలువురిని ఆకర్షించాయి. కార్యక్రమంలో సీఐ వీరయ్య, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ లు డాక్టర్ అబ్దుల్ రఫీక్, రంగరత్నం, ఏసీఈవో వినయ్ కుమార్, పీఆర్వో దండు స్వామి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు వెంకటరమణ, నాగజ్యోతి, నరేశ్ కుమార్, రజిత తదితరులు పాల్గొన్నారు.