అక్షరటుడే, వెబ్ డెస్క్: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ ఏసీపీ నారాయణ సూచించారు. నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్ లో శుక్రవారం కళాజాత ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఏసీపీ నారాయణ, సీఐ వెంకట నారాయణ హాజరై మాట్లాడారు. కమిషనరేట్ లో హెల్మెట్ తప్పనిసరి నిబంధన పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. నిబంధన ఉల్లంఘించే వారికి జరిమానాలు అమలు చేస్తున్నామన్నారు. ఇకపై స్పెషల్ డ్రైవ్ లు పెంచుతామని, పదేపదే నిబంధన ఉల్లంఘించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.