అక్షరటుడే, వెబ్‌డెస్క్ : మద్యం తాగి వాహనం నడిపిన నలుగురు వ్యక్తులకు కౌన్సెలింగ్ నిర్వహించినట్లు ట్రాఫిక్ సీఐ వీరయ్య తెలిపారు. అనంతరం వారిని బుధవారం కోర్టులో హాజరుపర్చగా మార్నింగ్ కోర్టు మేజిస్ట్రేట్ అహ్మద్ మోహినొద్దీన్ అందులో ముగ్గురికి రూ.8000 జరిమానా, ఒకరికి మూడు రోజుల జైలు శిక్ష విధించారని తెలిపారు.