Vehicle diversion | ముప్కాల్‌ వద్ద వాహనాల దారి మళ్లింపు

Vehicle diversion | ముప్కాల్‌ వద్ద వాహనాల దారి మళ్లింపు
Vehicle diversion | ముప్కాల్‌ వద్ద వాహనాల దారి మళ్లింపు
Advertisement

అక్షరటుడే, ఆర్మూర్ : Vehicle diversion | ముప్కాల్‌ వద్ద జాతీయ రహదారి–44పై(National Highway) వాహనాల రాకపోకలను దారి మళ్లించినట్లు బ్రిడ్జి నిర్మాణ సంస్థ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బైపాస్‌ రోడ్డు వద్ద నూతన బ్రిడ్జి నిర్మాణం నేపథ్యంలో నిర్మల్‌ నుంచి ఆర్మూర్, నిజామాబాద్, హైదరాబాద్‌ వెళ్లే భారీ వాహనాలు, బస్సులు, కార్లు, ఆటోలు ముప్కాల్‌ బైపాస్‌ రోడ్డు నుంచి నేరుగా ఉన్న సర్వీస్‌ రోడ్డు, ముప్కాల్‌ గాంధీచౌక్‌ మీదుగా ఆర్మూర్‌ వైపు వెళ్లాలని సూచించారు. అలాగే ఆర్మూర్‌ నుంచి నిర్మల్‌ వైపు వెళ్లే వాహనాలు ఇదే మార్గంలో ముప్కాల్‌ గాంధీచౌక్‌ నుంచి వెళ్లాలని తెలిపారు.

Advertisement