అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ : నగరంలో డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులో ముగ్గురికి జైలు శిక్ష పడింది. ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ పబ్బ ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని బస్టాండ్‌, నిఖిల్‌సాయి చౌరస్తా వద్ద డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తుండగా.. రాథోడ్‌ మోతీలాల్‌, అనిల్‌, పిల్లి సాగర్‌ మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరిని సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ అహ్మద్‌ మొయిద్దీన్‌ ఎదుట హాజరుపర్చగా శుక్రవారం రాథోడ్‌ మోతీలాల్‌కు వారం రోజులు, అనిల్‌, సాగర్‌కు మూడురోజుల జైలుశిక్ష విధిస్తూ ఆయన తీర్పు వెల్లడించారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Dichpalii | డ్రంకన్​ డ్రైవ్​ కేసులో ముగ్గురికి జైలుశిక్ష