అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ సీఐ వెంకట్ నారాయణ సూచించారు. నగరంలోని బస్టాండ్ వద్ద వాహనదారులకు ఆయన అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు సహకరించాలని కోరారు. కానిస్టేబుల్ శేఖర్ తదితరులు ఉన్నారు.